TG: నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో పదేళ్లు మన గోడు విన్నవారే లేరని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం మక్తల్‌లో మాట్లాడుతూ.. 'ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన రైతులకు రూ.20 లక్షల పరిహారం ఇస్తున్నాం. రైతులు అడిగినంత పరిహారం ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. దండు కట్టండి, గుంపు కట్టండి.. దగ్గరుండి పని చేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగిచండి' అని వ్యాఖ్యానించారు.