ఆర్టీసీతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా!

మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు 68.60 కోట్ల సార్లు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఫలితంగా రూ.2,350 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) అధికారులు, సిబ్బందితో బస్‌భవన్‌లో జరిగిన సమీక్ష నిర్వహించారు. టీజీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది కృషి, క్రమశిక్షణ, అంకితభావం వల్లనే ఈ పథకం విజయవంతమైందన్నారు.

సంబంధిత పోస్ట్