మహిళలకు రూ.3 లక్షల రుణం.. కేంద్రం అద్భుత పథకం!

దేశంలోని మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం 'ఉద్యోగిని యోజన' అనే అద్భుత పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే లేదా విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు ఎలాంటి తాకట్టు లేకుండా రుణం లభిస్తుంది. సాధారణ మహిళలు 30% వరకు, షెడ్యూల్డ్ కులాల మహిళలు 50% వరకు రుణ రాయితీ పొందవచ్చు. వితంతువులు, దివ్యాంగులకు ప్రత్యేక వడ్డీ రాయితీ సౌకర్యం ఉంది. 18-55 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు. ఆధార్, ఓటర్ ఐడీ, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ప్రాజెక్ట్ రిపోర్ట్ వంటివి అవసరం. సమీప బ్యాంకుల్లో లేదా ఉమాంగ్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕