చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఈడీ, ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. బిహార్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయని, ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను దారి మళ్లించారనే ఆరోపణలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారని తెలిసింది.