రూ.400 కోట్ల దావా.. సినిమా రిలీజ్ ఆపేయాలని డిమాండ్

బాలీవుడ్ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’ వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు డేవిడ్ ధావన్‌పై పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రూ.400 కోట్ల నష్టపరిహారం దావా వేసింది. తమ క్లాసిక్ హిట్ ‘బివి నెం.1’ లోని పాటలను అనుమతి లేకుండా వాడుతున్నారని ఆరోపించింది. ఈ చిత్రం ప్రమోషన్స్, స్ట్రీమింగ్, విడుదలపై స్టే ఇవ్వాలని కోరింది. పాటలను తొలగించి, టైటిల్ మార్చాలని డిమాండ్ చేసింది. పాటలు వాడితే అదనంగా రూ.100 కోట్లు చెల్లించాలని హెచ్చరించింది. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్