ఒక్క రోజులో రూ.48 లక్షల కోట్లు హుష్‌

అమెరికా కాలమానం ప్రకారం గురువారం టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు ఏకంగా 13 శాతం మేర పడిపోయాయి. ఒక్క రోజులోనే చోటుచేసుకున్న ఈ భారీ క్షీణత కారణంగా కంపెనీ దాదాపు 500 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 48 లక్షల కోట్లు) నష్టపోయింది. ఆల్ఫాబెట్ చరిత్రలో ఒకే ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన అతిపెద్ద పతనం ఇదేనని నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో 2008, 2020 సంవత్సరాలలో 10 శాతం మేర నష్టపోయిన రికార్డులను అధిగమిస్తూ, తాజా ఘటన ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕