ఖాతాల్లోకి రూ.6 వేలు.. అర్హతలు ఇవే!

TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' కింద సంవత్సరానికి రూ.12,000 (రెండు విడతల్లో రూ.6,000 చొప్పున) అందిస్తోంది. ఈ పథకానికి అర్హత పొందేందుకు లబ్ధిదారుడు తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. భూమి లేని వ్యవసాయ కూలీ అయి ఉండాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGA) కింద.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి. బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి.

సంబంధిత పోస్ట్