రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: మంత్రి ఉత్తమ్

వరి సేకరణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, ఇందుకు గాను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.7,887 కోట్లు చెల్లించాం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 8,401 PPCల ద్వారా లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు. సన్న రకాలకు రూ.314 కోట్లు బోనస్ చెల్లించామని తెలిపారు. ఈ మేరకు ధాన్యం సేకరణలో ఏపీ కంటే తెలంగాణ స్కేల్ 4 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్