TG: హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఎంపీ ఈటల రాజేందర్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీకల్లు ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. కల్తీ కల్లు దుకాణాలను కట్టడి చేయాలన్నారు.