హిమాచల్ ప్రదేశ్‌లోని రాంపూర్ సమీపంలో గురువారం ఘోర ప్రమాదం తప్పింది. 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ మంటలను గమనించి, బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కాలిపోతున్న వాహనం నుండి తప్పించుకోవడానికి ప్రయాణికులు కిటికీలు పగలగొట్టారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.