టికెట్ ధరలు తగ్గించిన ఆర్టీసీ.. నేటి నుంచే అమలు

TG: హైదరాబాద్ లోని జంట నగర వాసులకు ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ- మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి (మార్చి 1) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. నగరంలో తిరిగే మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో 4 కిలోమీటర్లకు గాను టికెట్ ఛార్జీ రూ.30గా ఉండగా.. దానిని రూ.25కి తగ్గించారు. అలాగే ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో 4 కి.మీ గాను రూ.35 చొప్పున టికెట్ ధర ఉండేది. తాజాగా రూ.25కి తగ్గించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 275 మెట్రో డీలక్స్, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్