తిరుపతిలో ఆర్టీసీ విజిలెన్స్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ వర్మ ఆత్మహత్య

AP: ఆర్టీసీ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతిలోని డీపీటీఓ కార్యాలయంలో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. నెల్లూరు వీఎస్‌వో ధర్మతేజ అవినీతి కేసులో వర్మ సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే ఆయన గురువారం ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕