ప్రపంచ సంక్షోభాల విషయంలో గ్లోబల్ సౌత్ దేశాలు ముందున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇకపై రూల్స్ పాటించేవిగా కాకుండా.. వాటిని సెట్ చేసివిగా గ్లోబల్ సౌత్ ఎదగాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ దేశాల బలం వాటి భిన్నత్వమేనని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.