సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, అనిల్ రావిపూడి స్పందించారు. మహేష్ తనకు ఎంతో ఆత్మీయుడని, ఆయనపై ప్రేమ, గౌరవం ఉన్నాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాజెక్ట్ వార్తల్లో నిజం లేదని, అలాంటి పుకార్లను నమ్మవద్దని, షేర్ చేయవద్దని కోరారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్, అనిల్ కలిసి పనిచేస్తారని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం మహేష్ ‘వారణాసి’తో, అనిల్ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ మేరకు అనిల్ ట్వీట్ చేశారు.