TG: వికారాబాద్(D) పరిగిలో పోస్ట్ ఆఫీసు వద్ద మహిళలు బారులు తీరారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 జమవుతాయని పుకార్లు లేవడంతో పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేయడానికి అధిక సంఖ్యలో జనం వచ్చారు. మీకు ఎవరు చెప్పారని అడిగితే ఒకరి నుండి మరొకరు చెప్పారు.. అందుకే వచ్చాం అంటూ మహిళలు సమాధానం ఇస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ మేనేజర్‌ను అడగగా తమకు ఎలాంటి సర్క్యులర్ రాలేదంటూ సమాధానం ఇచ్చారు. 15 రోజుల క్రితం హన్మకొండలో కూడా ఇలాగే జరిగింది.