ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 6 గంటల పాటు రన్‌వేల మూసివేత

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్‌ 19న రెండు రన్‌వేలపై విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వర్షాకాలం అనంతరం రన్‌వేల మరమ్మతులు, లైటింగ్‌ వ్యవస్థ తనిఖీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 1,033 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రన్‌వే ప్రాంతంలో ఇంజినీరింగ్‌ బృందాలు పనులు చేపట్టనున్నాయి. విమానయాన సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను రీషెడ్యూల్‌ చేయడంతో ప్రయాణికులు విమాన సమయాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕