AP: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్థానిక ఎన్నికల కోసం టీడీపీ నేత హర్షవర్దన్ తన ప్రియురాలు మంజీరను హడావుడిగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సాలూరులో ఛైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కానీ పొత్తులో పదవి జనసేనకు దక్కింది. దాంతో భార్య మంజీరను హర్షవర్దన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దింపారు. కానీ, ఫలితాల్లో అక్కడ జనసేన గెలిచింది. 21వ వార్డులో హర్షవర్ధన్(TDP) గెలిచినా.. భార్య ఓడిపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది.