ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక హైపర్‌సోనిక్ ఒరెష్నిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఇటీవల అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. రష్యా అత్యాధునిక క్షిపణుల్లో ఒరెష్నిక్ ఒకటి. ఇది మీడియం రేంజ్ క్షిపణి. ఇది గంటకు 13,000 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. యూరప్‌లోని అన్ని దేశాలు ఈ మిస్సైల్ పరిధిలోకి వస్తాయి.