రష్యా 22 టన్నుల బంగారం విక్రయం.. ఆర్థిక లోటు భర్తీకి కీలక నిర్ణయం

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, రష్యా తన ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి సుమారు 22 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2026 ప్రారంభం నుంచి జరిగిన ఈ అమ్మకాలతో దేశ బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఆదాయ వనరులు తగ్గి, ప్రభుత్వ ఖర్చులు పెరిగి బడ్జెట్ లోటు భారీగా పెరిగింది. 2026 మార్చి నాటికి ఈ లోటు 61.2 బిలియన్ డాలర్లకు చేరడంతో, లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్