ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుసగా మూడో రోజు వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌కు సమీపంలోని బుచా జిల్లాపై రష్యా చేసిన దాడిలో కనీసం 27 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. దాడిలో 50కిపైగా నివాస భవనాలు దెబ్బతినగా, ఇళ్లు, రెస్టారెంట్‌కు మంటలు వ్యాపించాయి. మైలా గ్రామంలోని ఓ గిడ్డంగిపై రష్యా దాడి చేయడంతో భారీ పేలుడు సంభవించినట్లు అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు.