ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్, మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమావేశం జరుగుతుండగా పదేపదే ఫోన్ మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్న జర్నలిస్టుతో, ఫోన్ పక్కన పెట్టకపోతే తమ సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు తీస్తారని లవ్రోవ్ హెచ్చరించారు. మొదట మర్యాదగా చెప్పినా వినకపోవడంతో, మంత్రి ఘాటుగా స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.