కీవ్‌పై రష్యా క్షిపణి దాడి.. ఐదుగురు మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణి దాడి జరిగింది. ప్రైవేట్ నివాస భవనాలపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో డినిప్రోవ్‌స్కీ జిల్లాలో భారీ గుంత ఏర్పడింది. గ్యాస్​ స్టేషన్​ ధ్వంసమైంది. కాగా ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. రాత్రిపూట జరిగిన బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది ఇళ్లు చీకటిమయమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕