ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా ఏకధాటిగా 12 గంటల పాటు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, 218 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీవ్‌లోని ముగ్గురు చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. నాలుగన్నరేళ్ల యుద్ధంలో కీవ్‌పై రష్యా ఇంత భారీస్థాయిలో దాడులు చేయడం ఇదే తొలిసారి. పౌరులే లక్ష్యంగా దాడులు జరిగాయని ఉక్రెయిన్ ఆరోపించింది. రైల్వే డిపోపై క్షిపణి పడటంతో ఆరుగురు ఉద్యోగులు మృతి చెందగా, వీరిలో ఒక భారత పౌరుడు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.