రష్యన్ మహిళ గోకర్ణ గుహలో తాను పిల్లలతో కలిసి సంతోషంగా జీవించినట్లు తెలిపారు. 20 దేశాలు తిరిగిన తన అనుభవంలో ఎక్కడైనా ప్రకృతిలోనే జీవించానని చెప్పారు. గుహలో పెయింటింగ్ చేస్తూ, పిల్లలతో ఆడుతూ, పాటలు పాడుతూ గడిపానని వెల్లడించారు. టీచర్‌గా చిన్నారులకు విద్య నేర్పుతున్నానని, పెయింటింగ్, వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నానని అన్నారు. ప్రస్తుతం మురికివాడ ప్రాంతంలో ఉంచిన కారణంగా అక్కడ జీవించలేకపోతున్నామన్నారు.