రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు ర్యాన్ రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే శతకం సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరపున అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుత ప్రదర్శనలో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో తిలక్ వర్మ, సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డులను అధిగమించాడు. రికెల్టన్ ముంబై ఫ్రాంచైజీకి చెందిన వివిధ లీగ్‌లలో కలిపి 3 సెంచరీలు సాధించగా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రెండేసి సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్