ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో వరల్డ్ నం.5 ఎలీనా రిబకినా అద్భుతమైన కమ్‌బ్యాక్ చేసి టైటిల్‌ను దక్కించుకున్నారు. ఫైనల్‌లో వరల్డ్ నం.1 ఆర్యనా సబలెంకాను 6-4, 4-6, 6-4 తేడాతో ఓడించారు. మొదటి సెట్లో రిబకినా మొదటి గేమ్‌లోనే సబలెంకాను బ్రేక్ చేసి 6-4తో గెలిచారు. సబలెంకా రెండవ సెట్లో 6-4తో తిరిగి బరిలోకి వచ్చారు. నిర్ణాయక మూడవ సెట్లో 3-0తో ముందున్న సబలెంకాను రిబకినా రెండు సార్లు బ్రేక్ చేసి 6-4తో మూడవ సెట్‌ను గెలిచారు.