సంక్రాంతి లోపే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!

తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభం కాగా.. 'రైతు భరోసా' పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నిధులను సంక్రాంతి పండుగలోపే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని సమాచారం. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తును వేగవంతం చేశాయి. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఈ సాయాన్ని సకాలంలో అందించి సానుకూలతను పెంచుకోవాలని సర్కార్ భావిస్తోందట. ప్రస్తుతం ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.

సంబంధిత పోస్ట్