నేటి నుంచే రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా': మంత్రి పొన్నం

TG: నేటి నుంచే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని అమంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియను మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో BRS సర్కార్ నిధుల విడుదలకు నెలల తరబడి సమయం తీసుకుందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం గతంలో 9 రోజుల్లోనే నిధులు వేసిందని, ఈసారి కూడా అంతే వేగంగా పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్