తెరుచుకున్న శబరిమల ఆలయం తలుపులు(వీడియో)

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తెరుచుకుంది. వార్షిక మండల-మకరవిళక్కు యాత్రా కాలం ప్రారంభం కావడంతో అర్చకులు తలుపులు తెరిచారు. ఈ యాత్ర తొలి దశ NOV 16 - DEC 27 వరకు ఉంటుంది. JAN 14, 2027న వచ్చే మకరవిళక్కు పండుగ కోసం ఆలయం తిరిగి DEC 30న తెరుచుకుంటుంది. ఇక భక్తుల రద్దీ నియంత్రణకు 18 పవిత్ర మెట్లపైకి నిమిషానికి 75 మందినే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే శబరిమలకు భారీగా భక్తులు తరలివెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕