కేరళంలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకోనుంది. మిథున మాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు గుడిని తెరిచి పూజలు నిర్వహిస్తారని వెల్లడించారు. పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 19న తిరిగి గుడిని మూసివేయన్నట్లు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా www.sabarimalaonline.org వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.