మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కిచెన్‌లో వంట చేస్తున్న వీడియో SMలో తెగ వైరల్ అవుతోంది. సంప్రదాయ మరాఠీ శైలిలో ఆయనే స్వయంగా ‘ఉక్డిచే మోదక్’ (ఆవిరి కుడుములు) తయారు చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. బ్యాటింగ్‌లోనే కాదు.. వంట చేయడంలోనూ మాస్టర్ బ్లాస్టర్ అదరగొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.