AP: కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్, జగదీశ్‌రెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్‌ఖాన్‌ను పోలీసులు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన సైనేడ్, ఇతర కెమికల్స్‌ను ఎక్కడ నుంచి తెచ్చారు, ఎలా వాడారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. సాదిక్‌కు సైనేడ్ సరఫరా చేసిన వ్యాపారుల సమక్షంలోనే అతడిని విచారిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.