దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్-19 మహిళల చాంపియన్‌షిప్‌లో భారత అండర్-17 జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 8-0 గోల్స్‌తో భూటాన్‌ను చిత్తు చేసింది. పెర్ల్ ఫెర్నాండెజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించగా, ప్రీతిక బర్మన్ రెండు గోల్స్ కొట్టింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది.