ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ నుంచి సాయి పల్లవి ఔట్

భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ముందుగా ఎంపికైన సాయి పల్లవి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. డేట్స్ సమస్యల కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ బయోపిక్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్