ఇంకా విడుదలకు నోచుకోని సాయి పల్లవి బాలీవుడ్ మూవీ

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి 'మేరీ రహో' అనే సినిమాలో నటిస్తోంది. మొదట 'ఏక్ దిన్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కావాల్సి ఉండగా, టైటిల్ మార్చి డిసెంబర్ 12న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు, హీరోహీరోయిన్ల లుక్స్ కూడా బయటకు రాలేదు. దీంతో ఈ ఏడాది సినిమా విడుదల అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్