స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు కేవలం రెండు వారాల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నవంబర్ 6న 'రామాయణ: పార్ట్ 1' విడుదల కానుండగా, సరిగ్గా రెండు వారాల తర్వాత ధనుష్ హీరోగా నటించిన 'ఓం: చాప్టర్ 1 – ఉదిరం' థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల నిర్మాతలకి థియేటర్ల కేటాయింపు, ప్రచార కార్యక్రమాలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం వంటి అంశాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.