స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 710 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్ అప్రెంటిస్ 516, డిప్లొమా టెక్నీషియన్ 124, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 70 పోస్టులు ఉన్నాయి. 2022–26 మధ్య సంబంధిత కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 31 నాటికి 18–28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అక్టోబర్ 20లోగా Apprenticeship India, NATS పోర్టళ్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఉంటుంది. నెలకు రూ.9,600 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ అందిస్తారు.