కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో సైమా (SIIMA) అవార్డ్స్-2026 అత్యంత అట్టహాసంగా జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలిరోజు దక్షిణాది సినీ తారలు హాజరై సందడి చేశారు. తెలుగు, కన్నడ సినిమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు.