TG: కేసీఆర్ పాటలపై వ్యాఖ్యానించిన ఐపీఎస్ అధికారి సజ్జనార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ పాటలు పెడితే కేసులు పెడతామనడానికి సజ్జనార్ ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పరిమితి దాటి ప్రవర్తించవద్దని, రిటైర్ అయి సప్తసముద్రాలు దాటి వెళ్లినా చట్టపరంగా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.