సజ్జనార్ ఫోటో డీప్ ఫేక్

బాలీవుడ్ నటి జాన్వీకపూర్ నటించిన 'చుట్టమల్లె' పాట మార్ఫింగ్ వీడియో విషయంలో నకిలీ వార్తలు వైరల్ అవ్వడంపై హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు, డీప్‌ఫేక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారాన్ని పంచుకోవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు. 'చుట్టమల్లె' పాటను అసభ్యంగా ఎడిట్ చేసిన ఒక నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ, సీపీ సజ్జనార్ కూడా అరెస్ట్ అయినట్లుగా ఒక ఏఐ-సృష్టించిన చిత్రాన్ని ఒక వినియోగదారు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ విషయం సజ్జనార్ దృష్టికి రావడంతో, ఆయన స్పందించి, ఇలాంటి చిత్రాలను షేర్ చేయవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕