ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

TG: ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. కాగా, ‘ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్లు వివరాలు ఇవ్వనివారికి ఈ నెల జీతం రాదు’ అని ఇప్పటికే ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వశాఖల అధిపతులను హెచ్చరించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్