నేటి నుంచి సలేశ్వరం లింగమయ్య జాతర(వీడియో)

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అరణ్య గర్భంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ జాతర మూడు రోజుల పాటు జరగనుంది. చైత్ర పౌర్ణమి వేళ ప్రారంభమయ్యే ఈ జాతర అడవి మార్గంలో చేసే సాహసయాత్రకూ గుర్తింపు పొందింది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాల మధ్య కొలువుదీరిన శివయ్యని రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి భక్తులు దర్శించుకుంటారు. లోతైన లోయలను దాటుతూ సాగే ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతినిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్