సల్మాన్ ఖాన్‌- నయనతార కాంబోలో కొత్త సినిమా!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభమై, 2027 ఈద్‌కు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వంశీ పైడిపల్లికి బాలీవుడ్ డెబ్యూ కానుంది. సల్మాన్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్