అజయ్ దేవ్‌గ‌ణ్‌ బంగ్లాలో సెలూన్, స్పా.. బీఎంసీ నోటీసులు

ముంబైలోని జుహులో ఉన్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ బంగ్లాలో చేపట్టిన నిర్మాణ పనులను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిలిపివేసింది. నివాస ప్రాపర్టీలో సెలూన్, స్పా వంటి వాణిజ్య కార్యకలాపాల కోసం మార్పులు చేస్తున్నారని, దీనిపై హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. వాణిజ్య వినియోగానికి అనుమతులు లేవని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు, సమాధానం ఇచ్చేందుకు దేవ్‌గణ్ కుటుంబానికి నాలుగు వారాల గడువు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕