నటి సమంత రూత్ ప్రభు అనారోగ్యం, విమర్శల మధ్య కూడా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె తన బ్యాక్ మజిల్స్‌ను చూపిస్తూ జిమ్‌లో తీసిన ఫోటోను షేర్ చేసింది. గతంలో అసాధ్యమనుకున్న దృఢమైన వీపును పట్టుదల, శ్రమతో సాధించినట్లు తెలిపింది. శరీరానికి కండరాలను పెంచుకోవడం, వయసు పెరిగే కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం ముఖ్యమని, ప్రయత్నిస్తూ ముందుకు సాగాలని ఆమె అభిమానులకు స్ఫూర్తినిచ్చారు.