పెళ్ళైన నాలుగు రోజులకే సెట్స్‌లో అడుగుపెట్టిన సమంత

నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్‌ నిడిమోరు వివాహం డిసెంబర్ 1న జరిగింది. పెళ్లైన నాలుగు రోజులకే సమంత తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్‌లో తిరిగి జాయిన్ అయ్యింది. దర్శకురాలు నందిని రెడ్డి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, మంజుష కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

సంబంధిత పోస్ట్