సినీ నటి సమంత త్వరలో బుల్లితెరపై సందడి చేయనుంది. సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్న ఆమె.. తమిళంలో ప్రసారం కానున్న ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’ వంటల కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్నట్లు సమాచారం. గతంలో ‘సామ్ జామ్’ టాక్ షోకు హోస్టింగ్ చేసిన సమంత.. ఇప్పుడు మరోసారి టీవీ ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. కాగా, గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీతో ఉంది.