సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలై 11 రోజులు పూర్తయినా వసూళ్ల జోరు కొనసాగుతోంది. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.85 లక్షల షేర్ రాబట్టిన ఈ చిత్రం, ఇప్పటివరకు అక్కడ రూ.22 కోట్ల షేర్, రూ.42.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38.31 కోట్ల షేర్, రూ.77.75 కోట్ల గ్రాస్ సాధించింది. లాంగ్‌రన్‌లో రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని సౌత్‌లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.