నటి సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' తర్వాత వస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. దసరా సందర్భంగా ఈ నెల 2న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న రెండో చిత్రమిది. 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సంబంధిత వీడియోను సమంత తాజాగా రిలీజ్ చేశారు.