బేబీ బంప్‏తో సమంత వర్కౌట్స్.. వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత, సినీ జీవితాల్లో ఆనందకరమైన దశను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'మా ఇంటి బంగారం' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఆమె, అదే సమయంలో తాను గర్భవతినని ప్రకటించి కొంతకాలం మెటర్నిటీ బ్రేక్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. తాజాగా జూన్ నెల జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్న సమంత, బేబీ బంప్‌తో ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేశారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కొనసాగిస్తున్న ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్